కరెంటు ఖాతా లోటు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత కరెంటు ఖాతా లోటు (సీఏడీ) అంచనాలను విదేశీ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ పెంచింది. జీడీపీలో 1.9 శాతానికి అంటే 60 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4.50 లక్షల కోట్ల)కు చేరొచ్చని పేర్కొంది. ఇంతకుముందు కరెంటు ఖాతా లోటును 45 బిలియన్‌ డాలర్లు ఉండొచ్చని సంస్థ అంచనా వేసింది.

Published : 03 Dec 2021 01:34 IST

 అంచనా పెంచిన బార్‌క్లేస్‌ జీడీపీలో 1.9 శాతానికి 

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత కరెంటు ఖాతా లోటు (సీఏడీ) అంచనాలను విదేశీ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ పెంచింది. జీడీపీలో 1.9 శాతానికి అంటే 60 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4.50 లక్షల కోట్ల)కు చేరొచ్చని పేర్కొంది. ఇంతకుముందు కరెంటు ఖాతా లోటును 45 బిలియన్‌ డాలర్లు ఉండొచ్చని సంస్థ అంచనా వేసింది. నవంబరు నెలలో దిగుమతులు ఏడాది క్రితంతో పోలిస్తే 57.2 శాతం పెరగడంతో, వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో 23.27 బిలియన్‌ డాలర్లకు చేరడం ఇందుకు కారణమని పేర్కొంది. ఎగుమతుల్లో వృద్ధి దిగుమతుల స్థాయి కంటే తక్కువగా ఉండటం, దేశీయ వ్యాపార కార్యకలాపాల్లో స్తబ్దత, కమొడిటీ ధరలు పెరగడం వల్ల వాణిజ్య లోటు పెరగడం కొనసాగుతోందని బార్‌క్లేస్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని