హెచ్‌యూఎల్‌ ఇక ‘బొగ్గు’ రహితం

బయోడీజిల్‌ వంటి హరిత ఇంధన ప్రత్యామ్నాయాలకు మళ్లినట్లు దిగ్గజ ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ హెచ్‌యూఎల్‌ వెల్లడించింది. తన అన్ని కార్యకలాపాల్లో బొగ్గు వాడకాన్ని నిలిపివేసినట్లు గురువారం సంస్థ పేర్కొంది. ఇందు కోసం బయోమాస్‌ సరఫరాదార్లు, స్థానిక రైతులతో కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Updated : 03 Dec 2021 05:22 IST

హరిత ఇంధన వినియోగమే

దిల్లీ: బయోమాస్‌, బయోడీజిల్‌ వంటి హరిత ఇంధన ప్రత్యామ్నాయాలకు మళ్లినట్లు దిగ్గజ ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ హెచ్‌యూఎల్‌ వెల్లడించింది. తన అన్ని కార్యకలాపాల్లో బొగ్గు వాడకాన్ని నిలిపివేసినట్లు గురువారం సంస్థ పేర్కొంది. ఇందు కోసం బయోమాస్‌ సరఫరాదార్లు, స్థానిక రైతులతో కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. బొగ్గు ఆధారిత బాయిలర్లను పునరుత్పాదక ఇంధన బాయిలర్లుగా మార్చడం వల్ల వ్యయాలను ఆదా చేసుకోగలమనీ కంపెనీ తెలిపింది. మాతృ సంస్థ యునిలీవర్‌ అయిదేళ్ల కిందటే, తన కార్యకలాపాలన్నిటిలోనూ బొగ్గు వాడకం మానేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఈ అడుగు వేసినట్లు హెచ్‌యూఎల్‌ తెలిపింది. ‘ఇదొక మైలురాయి. ప్రజలు, భూగోళం గురించి ఎపుడూ మేం ఆలోచిస్తాం. బాద్యతాయుత వ్యాపారంలోనే మాకు నమ్మకం ఎక్కువ అని’ సంస్థ సీఎండీ సంజీవ్‌ మెహతా పేర్కొన్నారు.

రెన్యూ పవర్‌తో ఎల్‌ అండ్‌ టీ భాగస్వామ్యం..: భారత్‌లో హరిత హైడ్రోజన్‌ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి, సొంతం చేసుకుని నిర్వహించడానికి రెన్యూ పవర్‌, ఎల్‌ అండ్‌ టీలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ‘ఎల్‌ అండ్‌ టీకి ఒక హరిత ఇంధన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకునే ప్రయాణంలో రెన్యూతో ఒప్పందం మైలురాయిలాంటిద’ని ఎల్‌ అండ్‌ టీ సీఈఓ, ఎండీ ఎస్‌.ఎన్‌. సుబ్రమణ్యం పేర్కొన్నారు. తాజా పరిణామంతో ఇరు కంపెనీలు తమ విజ్ఞానం, నైపుణ్యం, వనరులు కలబోసి గరిష్ఠ ప్రయోజనం పొందుతాయని రెన్యూ ఛైర్మన్‌, సీఈఓ సుమంత్‌ సిన్హా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని