ఇన్‌స్టామార్ట్‌లో రూ.5250 కోట్ల పెట్టుబడులు: స్విగ్గీ

నిత్యావసరాలను వేగంగా సరఫరా చేసే తమ అనుబంధ సంస్థ అయిన ఇన్‌స్టామార్ట్‌లో 700 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.5,250 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆహార డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ పేర్కొంది. గతేడాది గురుగ్రామ్‌, బెంగళూరులలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ సేవలు మొదలు కాగా

Updated : 03 Dec 2021 05:24 IST

దిల్లీ: నిత్యావసరాలను వేగంగా సరఫరా చేసే తమ అనుబంధ సంస్థ అయిన ఇన్‌స్టామార్ట్‌లో 700 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.5,250 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆహార డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ పేర్కొంది. గతేడాది గురుగ్రామ్‌, బెంగళూరులలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ సేవలు మొదలు కాగా.. ఇపుడు 18 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. వారానికి 10 లక్షలకు పైగా ఆర్డర్లు నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలిపింది. కొద్ది నెలలుగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లోకి రోజుకొక గిడ్డంగి (విక్రేతలు నిర్వహించేవి) చొప్పున జత చేరుతూ వచ్చాయి. 2022 జనవరి కల్లా తన వినియోగదార్లకు ఈ గిడ్డంగులు మరింత చేరువవుతాయన్న అంచనాలతో, 15 నిమిషాల్లోనే నిత్యావసరాలు డెలివరీ చేయనున్నట్లు కంపెనీ  పేర్కొంది.

క్యూ-కామర్స్‌ కంపెనీలతో పోటీ
సంప్రదాయ ఇ-కామర్స్‌ సంస్థల డెలివరీకి ఒక రోజు లేదా అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటుండగా క్విక్‌-కామర్స్‌ సంస్థలు తక్కువ పరిమాణం ఉన్న వస్తువులను వేగంగా వినియోగదార్లకు అందచేస్తున్నాయి. జొమోటోకు చెందిన గ్రోఫర్స్‌తో పాటు, డుంజో వంటివి ఇలాంటి సేవలు అందిస్తుండగా.. వీటితో ఇన్‌స్టామార్ట్‌ పోటీ పడనుంది. వచ్చే మూడు త్రైమాసికాల్లో 100 కోట్ల  డాలర్ల వార్షిక స్థూల మర్చండైజ్‌ విలువను చేరుకోవచ్చని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష మాజేటి అంటున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టామార్ట్‌ సేవలు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విశాఖపట్నంలలో అందుబాటులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని