రిలయన్స్‌ కేపిటల్‌ దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభం

దివాలా స్మృతిలోని వివిధ సెక్షన్ల కింద రిలయన్స్‌ కేపిటల్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించే నిమిత్తం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చర్యలు చేపట్టింది. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), ముంబయి బెంచ్‌కు ఇందుకోసం దరఖాస్తు సమర్పించింది.

Updated : 03 Dec 2021 05:26 IST

ఎన్‌సీఎల్‌టీకి ఆర్‌బీఐ దరఖాస్తు

దివాలా స్మృతిలోని వివిధ సెక్షన్ల కింద రిలయన్స్‌ కేపిటల్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించే నిమిత్తం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చర్యలు చేపట్టింది. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), ముంబయి బెంచ్‌కు ఇందుకోసం దరఖాస్తు సమర్పించింది. దీంతో రిలయన్స్‌ కేపిటల్‌పై తాత్కాలిక మారటోరియం నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం.. ఏ రుణ సంస్థ రిలయన్స్‌ కేపిటల్‌ ఆస్తులను విక్రయించడం లేదా ఎవరికీ బదిలీ చేయకూడదు. రుణాల చెల్లింపులో విఫలమైన నేపథ్యంలో నవంబరు 29న రిలయన్స్‌ కేపిటల్‌ బోర్డును ఆర్‌బీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అడ్మినిస్ట్రేటర్‌గా వై.నాగేశ్వరరావు (బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు)ను నియమించింది.

సుప్రీంకోర్టులో డీఎంఆర్‌సీ పిటిషన్‌ కొట్టివేత: దిల్లీ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు (డీఏఎంఈపీఎల్‌) రూ.4,600 కోట్లు చెల్లించాలంటూ 2017లో ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇందులో సమీక్షించేదీ ఏమీ లేదంటూ న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. డీఏఎంఈపీఎల్‌.. అనిల్‌ అంబానీ గ్రూపునకు చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనుబంధ సంస్థ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని