కొనసాగిన లాభాల పరుగు

మదుపర్ల కొనుగోళ్లతో రెండో రోజూ సూచీల లాభాల పరుగు కొనసాగింది. కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాలతో అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగానే ఉన్నా, దేశీయ మదుపర్లు పట్టించుకోలేదు. హెచ్‌డీఎఫ్‌సీ జంట, ఐటీ, లోహ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. రూపాయి 12 పైసలు తగ్గి  75.03 వద్ద ముగిసింది.

Published : 03 Dec 2021 04:47 IST

రాణించిన హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు
17400 పాయింట్లకు నిఫ్టీ
సమీక్ష

మదుపర్ల కొనుగోళ్లతో రెండో రోజూ సూచీల లాభాల పరుగు కొనసాగింది. కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాలతో అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగానే ఉన్నా, దేశీయ మదుపర్లు పట్టించుకోలేదు. హెచ్‌డీఎఫ్‌సీ జంట, ఐటీ, లోహ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. రూపాయి 12 పైసలు తగ్గి  75.03 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో షాంఘై, టోక్యో నష్టపోగా.. హాంకాంగ్‌, సియోల్‌ లాభపడ్డాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో కదలాడాయి.
* సూచీల జోరు నేపథ్యంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత రెండు ట్రేడింగ్‌ రోజుల్లో రూ.5.35 లక్షల కోట్లు పెరిగి  రూ.262.52 లక్షల కోట్లకు చేరింది.
* సెన్సెక్స్‌ ఉదయం 57,781.48 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. రోజంతా అదే జోరు కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 58,513.93 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 776.50 పాయింట్లు దూసుకెళ్లి 58,461.29 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 234.75 పాయింట్లు లాభపడి 17,401.65 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 17,149.30- 17,420.35 పాయింట్ల మధ్య కదలాడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 27 లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ 3.92%, పవర్‌గ్రిడ్‌ 3.65%, సన్‌ఫార్మా 3.11%, టాటా స్టీల్‌ 2.80%, టెక్‌ మహీంద్రా 2.60%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.55%, బజాజ్‌ ఆటో 2.35%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.14%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.99%, ఇన్ఫోసిస్‌ 1.91% లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌  0.78%, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.55%, అల్ట్రాటెక్‌ 0.03% చొప్పున తగ్గాయి. రంగాల వారీ సూచీల్లో యుటిలిటీస్‌, విద్యుత్‌, ఐటీ, టెక్‌, చమురు- గ్యాస్‌, లోహ, ఫైనాన్స్‌ 2.21% వరకు పరుగులు తీశాయి. బీఎస్‌ఈలో 2185 షేర్లు లాభపడగా, 1065 స్క్రిప్‌లు నష్టపోయాయి. 150 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
* ఆనంద్‌ రాఠీ వెల్త్‌ ఐపీఓ తొలిరోజు 1.60 రెట్ల స్పందన వచ్చింది. ఇష్యూలో భాగంగా 84,75,000 షేర్లు ఆఫర్‌ చేయగా.. 1,36,00,818 షేర్లకు బిడ్లు లభించాయి. ఈ ఇష్యూ 6న ముగియనుంది.
* టెగా ఇండస్ట్రీస్‌ ఇష్యూ రెండో రోజుకు  13.87 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 95,68,636 షేర్లను ఆఫర్‌ చేయగా.. 13,26,78,876 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్‌ విభాగంలో 17.04 రెట్ల ఆసక్తి కనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని