జీఎస్‌కే కొవిడ్‌ ఔషధానికి బ్రిటన్‌ అనుమతి

కొవిడ్‌-19 వైరస్‌ బారిన పడి, వ్యాధి లక్షణాలు తీవ్రమవుతాయని భావించే రోగుల చికిత్సలో వినియోగించేందుకు బ్రిటన్‌కు చెందిన గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ (జీఎస్‌కే), అమెరికాకు చెందిన వీర్‌ బయోటెక్నాలజీ సంస్థలు అభివృద్ధి చేసిన సొట్రోవిమాబ్‌ ఔషధానికి బ్రిటన్‌ గురువారం అనుమతి ఇచ్చింది.

Published : 03 Dec 2021 04:47 IST

ఒమిక్రాన్‌పైనా ప్రభావశీలత

లండన్‌: కొవిడ్‌-19 వైరస్‌ బారిన పడి, వ్యాధి లక్షణాలు తీవ్రమవుతాయని భావించే రోగుల చికిత్సలో వినియోగించేందుకు బ్రిటన్‌కు చెందిన గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ (జీఎస్‌కే), అమెరికాకు చెందిన వీర్‌ బయోటెక్నాలజీ సంస్థలు అభివృద్ధి చేసిన సొట్రోవిమాబ్‌ ఔషధానికి బ్రిటన్‌ గురువారం అనుమతి ఇచ్చింది. స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలతో బాధపడుతూ, వ్యాధి తీవ్రత పెరుగుతుందని భావించే కొవిడ్‌-19 రోగులకు మోనోక్లోనోకల్‌ యాంటీబాడీ చికిత్స అయిన ‘సొట్రోవిమాబ్‌’ సురక్షితమని తేలిందని, మరణాల ముప్పును తగ్గిస్తున్నట్లు బ్రిటన్‌ ఔషధ నియంత్రణ సంస్థ మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రోడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఏ) తెలిపింది. లక్షణాలు ప్రారంభమైన 5 రోజుల్లోపే ఈ ఔషధాన్ని ఇవ్వాలని సిఫారసు చేసింది. కొత్తగా వెలుగుచూసిన ఒమిక్రాన్‌ సార్స్‌-కోవ్‌-2 వేరియంట్‌ మ్యూటేషన్లపైనా ఈ ఔషధం ప్రభావశీలంగా పనిచేస్తున్నట్లు క్లినికల్‌ పరీక్షల్లో తేలినట్లు జీఎస్‌కే వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచనల మేరకు కొవిడ్‌ అన్ని వేరియంట్లపైనా సొట్రోవిమాబ్‌ను వినియోగించినట్లు వివరించింది. ఈ ఔషధం ఒక డోస్‌ వినియోగిస్తే, 79 శాతం మేర మరణాలు నివారించవచ్చని, ఆసుపత్రుల్లో చేరే అవసరాలను తగ్గించొచ్చని జీఎస్‌కే చెబుతోంది. జివుడి బ్రాండ్‌పై ఈ ఔషధాన్ని విక్రయించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని