Uber-Whatsapp: వాట్సాప్‌లోనూ ఉబర్‌ బుకింగ్‌

ఉబర్‌ క్యాబ్‌లను ఇకపై వాట్సాప్‌ నుంచీ బుక్‌ చేసుకునే వీలు కల్పిస్తున్నారు. ఉబర్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, వాట్సాప్‌ చాట్‌ ద్వారానే వినియోగదారు రిజిస్ట్రేషన్‌, క్యాబ్‌ బుకింగ్‌, ప్రయాణాలకు సంబంధించిన రసీదులు వంటివి పొందొచ్చని ఉబర్‌ తెలిపింది

Updated : 03 Dec 2021 09:12 IST

దిల్లీ: ఉబర్‌ క్యాబ్‌లను ఇకపై వాట్సాప్‌ నుంచీ బుక్‌ చేసుకునే వీలు కల్పిస్తున్నారు. ఉబర్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, వాట్సాప్‌ చాట్‌ ద్వారానే వినియోగదారు రిజిస్ట్రేషన్‌, క్యాబ్‌ బుకింగ్‌, ప్రయాణాలకు సంబంధించిన రసీదులు వంటివి పొందొచ్చని ఉబర్‌ తెలిపింది. ఉబర్‌ యాప్‌లో ఉండే సేవలు, సదుపాయాలు వాట్సాప్‌ బుకింగ్‌లోనూ ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతానికి ఈ వాట్సాప్‌ ఉబర్‌ బుకింగ్‌లను లఖ్‌నవూలో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని, త్వరలో దేశమంతటా విస్తరింపజేయనున్నట్లు ఉబర్‌ ఏపీఏసీ సీనియర్‌ డైరెక్టర్‌ (వ్యాపార అభివృద్ధి) నందిని మహేశ్వరి వెల్లడించారు. వాట్సాప్‌ బిజినెస్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు.

ఇలా చేసుకోవచ్చు: ఉబర్‌ బిజినెస్‌ అకౌంట్‌ నెంబరుకు మెసేజ్‌ చేసి, లేదా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, లేదా లింక్‌ను క్లిక్‌ చేయడం ద్వారా నేరుగా ఉబర్‌ వాట్సాప్‌ చాట్‌ తెరుచుకుంటుంది. అందులో ప్రయాణికులు ఎక్కేచోటు, గమ్యస్థానం వివరాలు నమోదు చేసి క్యాబ్‌ బుక్‌ చేసుకోవచ్చు. ప్రయాణానికి చెల్లించాల్సిన ధర, డ్రైవర్‌ ఎంత సమయంలో వినియోగదారు దగ్గరకు చేరుకుంటారు.. తదితర వివరాలన్నీ వాట్సాప్‌ బుకింగ్‌లో తెలుస్తాయని వాట్సాప్‌ భారత అధిపతి అభిజిత్‌ బోస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని