బౌన్స్‌ ఇన్ఫినిటీ ఇ1

విద్యుత్‌ వాహన (ఈవీ) సంస్థ బౌన్స్‌ తమ విద్యుత్తు-స్కూటర్‌ ‘ఇన్ఫినిటీ ఇ1’ను విపణిలోకి విడుదల చేసింది. ఈ వాహనం ప్రారంభ ధర రూ.45,099 (ఎక్స్‌-షోరూమ్‌, దిల్లీ). బ్యాటరీ, ఛార్జర్‌తో కలిపి స్కూటర్‌ కొనుగోలు చేయాలంటే రూ.68,999 (ఎక్స్‌-షోరూమ్‌

Updated : 03 Dec 2021 10:00 IST

 ప్రారంభ ధర రూ.45,099
బ్యాటరీ సహా రూ.68,999

బెంగళూరు: విద్యుత్‌ వాహన (ఈవీ) సంస్థ బౌన్స్‌ తమ విద్యుత్తు-స్కూటర్‌ ‘ఇన్ఫినిటీ ఇ1’ను విపణిలోకి విడుదల చేసింది. ఈ వాహనం ప్రారంభ ధర రూ.45,099 (ఎక్స్‌-షోరూమ్‌, దిల్లీ). బ్యాటరీ, ఛార్జర్‌తో కలిపి స్కూటర్‌ కొనుగోలు చేయాలంటే రూ.68,999 (ఎక్స్‌-షోరూమ్‌, దిల్లీ) చెల్లించాలి. అదే బ్యాటరీ కొనుగోలు చేయకుండా, బ్యాటరీ యాజ్‌-ఎ-సర్వీస్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే రూ.45,099 చెల్లిస్తే సరిపోతుంది. బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌ ఆప్షన్‌ ఆఫర్‌ ఇవ్వడం దేశీయ ఇ-స్కూటర్‌ విపణిలో ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. ఇ-స్కూటరును రూ.499తో ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చని, ఫేమ్‌-2 ప్రోత్సాహకాలు వర్తిస్తాయని బౌన్స్‌ సహ వ్యవస్థాపకులు, సీఈఓ వివేకానంద హల్లేకెరె వెల్లడించారు. మార్చి త్రైమాసికం చివర్లో దేశ వ్యాప్తంగా డెలివరీలు ప్రారంభిస్తామని తెలిపారు. 48వీ 39 ఏహెచ్‌, పోర్టబుల్‌ బ్యాటరీతో ఇ-స్కూటర్లు లభిస్తాయి. 4-5 గంటల్లో పూర్తి ఛార్జింగ్‌ అవుతుందని,  85 కి.మీ ప్రయాణించవచ్చని సంస్థ తెలిపింది. భివండీ ప్లాంట్‌లో ఏడాదికి 1,80,000 స్కూటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని, దక్షిణాదిన మరో ప్లాంట్‌ నెలకొల్పే ప్రణాళిక ఉన్నట్లు వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని