రూ.90,000 కోట్లతో 100 విమానాలు!

త్వరలో కార్యకలాపాలు ప్రారంభించబోతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ 100 విమానాలను (నారో-బాడీ) కొనుగోలు చేసే ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందుకోసం 1,200 కోట్ల డాలర్లు (సుమారు రూ.90,000 కోట్లు) అవసరమని సంస్థ కొత్త యజమానులు మురారి లాల్‌ జలాన్‌ (యూఏఈ వ్యాపారవేత్త), కాల్రాక్‌ క్యాపిటల్‌

Updated : 03 Dec 2021 03:05 IST

బోయింగ్‌, ఎయిర్‌బస్‌తో జెట్‌ ఎయిర్‌వేస్‌ చర్చలు

దిల్లీ: త్వరలో కార్యకలాపాలు ప్రారంభించబోతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ 100 విమానాలను (నారో-బాడీ) కొనుగోలు చేసే ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందుకోసం 1,200 కోట్ల డాలర్లు (సుమారు రూ.90,000 కోట్లు) అవసరమని సంస్థ కొత్త యజమానులు మురారి లాల్‌ జలాన్‌ (యూఏఈ వ్యాపారవేత్త), కాల్రాక్‌ క్యాపిటల్‌ (యూకేలోని పెట్టుబడుల సంస్థ) ప్రతినిధి తెలిపారు. విమాన తయారీ సంస్థలైన బోయింగ్‌, ఎయిర్‌బస్‌ ఎస్‌ఈతో చర్చలు సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. జలాన్‌-కాల్రాక్‌ కన్సార్షియం.. ఈక్విటీ, రుణం రూపంలో వచ్చే 6 నెలల్లో జెట్‌ ఎయిర్‌వేస్‌లో 20 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,500 కోట్లు) పెట్టుబడి పెట్టబోతున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్‌ 22న జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిష్కార ప్రణాళికకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 2022 తొలి త్రైమాసికంలో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రయత్నిస్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో 2019 ఏప్రిల్‌ నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా నేతృత్వంలోని ఆకాశ ఎయిర్‌.. 72 బోయింగ్‌ 737 మ్యాక్స్‌ జెట్‌లకు 900 కోట్ల డాలర్లతో (సుమారు రూ.67,500 కోట్లు) ఆర్డర్‌ ఇచ్చిన నెలలోపే జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా తమ ప్రణాళిక వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని