మా సంస్థలో వాటాను ఎయిర్‌టెల్‌  కొనుగోలు చేయడం లేదు: డిష్‌టీవీ

డిష్‌టీవీ ఇండియాలో భారతీ ఎయిర్‌టెల్‌ మెజార్టీ వాటా కొనుగోలు చేయనున్నట్లు వస్తున్న వార్తలను డిష్‌టీవీ కొట్టిపారేసింది. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. డిష్‌టీవీలో ప్రమోటర్ల గ్రూపు, యెస్‌ బ్యాంకుకున్న వాటాలో 5.93 శాతం వాటా కొనుగోలు నిమిత్తం భారతీ ఎయిర్‌టెల్‌

Updated : 03 Dec 2021 03:03 IST

దిల్లీ: డిష్‌టీవీ ఇండియాలో భారతీ ఎయిర్‌టెల్‌ మెజార్టీ వాటా కొనుగోలు చేయనున్నట్లు వస్తున్న వార్తలను డిష్‌టీవీ కొట్టిపారేసింది. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. డిష్‌టీవీలో ప్రమోటర్ల గ్రూపు, యెస్‌ బ్యాంకుకున్న వాటాలో 5.93 శాతం వాటా కొనుగోలు నిమిత్తం భారతీ ఎయిర్‌టెల్‌ ప్రాథమిక చర్చలు జరుపుతోందని ఓ ఆంగ్లపత్రిక వెల్లడించింది. దీనిపై స్పందిస్తూ ‘షేరు ధరపై ప్రభావం చూపించే ఎలాంటి సమాచారమైనా సెబీ నిబంధనల ప్రకారం వెల్లడించాల్సి ఉంటుంది.  ప్రస్తుతం మా వద్ద అటువంటి సమాచారం ఏదీ లేదనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆ వార్తాకథనంలో చెప్పిన లావాదేవీ గురించి మాకు తెలియదు’ అని ఎక్స్ఛేంజీలకు డిష్‌టీవీ తెలియజేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని