హిందీలో లింక్డ్‌ఇన్‌

వృత్తిపరమైన సామాజిక మాధ్యమం లింక్డ్‌ఇన్‌ గురువారం నుంచి హిందీ భాషలోనూ సేవలందిస్తోంది. లింక్డ్‌ఇన్‌కు ఇది తొలి భారతీయ భాష కావడం విశేషం. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉంటూ, హిందీలో మాట్లాడేవారు.. ఉద్యోగావకాశాల సమాచారం తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుందని

Updated : 03 Dec 2021 03:01 IST

బెంగళూరు: వృత్తిపరమైన సామాజిక మాధ్యమం లింక్డ్‌ఇన్‌ గురువారం నుంచి హిందీ భాషలోనూ సేవలందిస్తోంది. లింక్డ్‌ఇన్‌కు ఇది తొలి భారతీయ భాష కావడం విశేషం. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉంటూ, హిందీలో మాట్లాడేవారు.. ఉద్యోగావకాశాల సమాచారం తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుందని కంపెనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా లింక్డ్‌ఇన్‌ 25 భాషల్లో సేవలు అందిస్తోంది. మొదటి దశలో భాగంగా డెస్క్‌టాప్‌, మొబైల్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌లపై హిందీలో ఫీడ్‌, ప్రొఫైల్‌, ఉద్యోగాలు, మెసేజింగ్‌, కంటెంట్‌ సృష్టించడం వంటి వాటిని సభ్యులు చేయొచ్చని లింక్డ్‌ఇన్‌ తెలిపింది. లింక్డ్‌ఇన్‌కు అంతర్జాతీయంగా 80 కోట్ల మంది సభ్యులు ఉండగా, భారత్‌లో 8.2 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు