సాంకేతికత నియంత్రణకు అంతర్జాతీయ సమష్టి ప్రణాళిక

ఎప్పటికీ మారుతూ ఉండే సాంకేతికత, సాంకేతికతపై ఆధారపడి జరిగే చెల్లింపుల వ్యవస్థను సమర్థవంతంగా నియంత్రించడానికి ఒక ‘సమష్టి అంతర్జాతీయ ప్రణాళిక’ అవసరమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

Published : 04 Dec 2021 01:35 IST

 ‘క్రిప్టోకరెన్సీ’ నేపథ్యంలో ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు

దిల్లీ: ఎప్పటికీ మారుతూ ఉండే సాంకేతికత, సాంకేతికతపై ఆధారపడి జరిగే చెల్లింపుల వ్యవస్థను సమర్థవంతంగా నియంత్రించడానికి ఒక ‘సమష్టి అంతర్జాతీయ ప్రణాళిక’ అవసరమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ‘ఇప్పటిదాకా నియంత్రణ సంస్థలు తరచూ మారుతూ ఉండే సాంకేతికతను నియంత్రించే విషయంలో ‘నేర్చుకునే స్థాయి’లోనే ఉన్నాయి. ఈ విషయంలో ‘ఏక సూత్రం’ అంటూ ఏదీ ఉండకపోవడమే ఇందుకు కారణమ’ని మంత్రి వివరించారు. ‘జాతీయ స్థాయిలో మేం ఆలోచిస్తున్నప్పటికీ.. అంతర్జాతీయంగా కూడా సమష్టి వ్యవస్థ ఉండాలి. అపుడే క్రిప్టో కరెన్సీ అయినా.. చెల్లింపుల వ్యవస్థ అయినా.. డేటా గోప్యత అయినా ఎటువంటి సాంకేతికత మార్పులనైనా స్థిరంగా గమనిస్తూ ఉండగలం. సాంకేతికతకు ఎటువంటి భౌతిక సరిహద్దులూ ఉండవు. అందు వల్ల అంతర్జాతీయ కార్యాచరణతోనే దీనిని నియంత్రించగలమ’ని శుక్రవారమిక్కడ జరిగిన ఇన్‌ఫినిటీ ఫోరమ్‌ 2021లో పేర్కొన్నారు. ‘గత కొన్నేళ్లుగా డిజిటల్‌ విప్లవాన్ని భారత్‌ చూస్తోంది. పేదలకు సాధికారతను అందించడానికి అందరికీ బ్యాంకు సేవలను చేరువ చేయగలిగాం. ఇపుడు సంప్రదాయ బ్యాంకు శాఖలు ఎక్కువగా అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్లతోనే బ్యాంకు సేవలను నిరంతరాయంగా ప్రజలు పొందగలుగుతున్నార’ని ఆమె అన్నారు. భారత్‌లో 129 కోట్ల మందికి ఆధార్‌ కార్డులుడంగా.. 100 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదార్లు ఉన్నారని సీతారామన్‌ గుర్తు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని