శ్రీరామ్‌ ప్రోపర్టీస్‌ రూ.600 కోట్ల ఐపీఓ 8 నుంచి

శ్రీరామ్‌ ప్రోపర్టీస్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) 8న ప్రారంభమై 10న ముగియనుంది. ఇష్యూ ద్వారా రూ.600 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. తాజా షేర్ల జారీ ద్వారా రూ.250 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో రూ.350 కోట్లు సమీకరించనుంది.

Published : 04 Dec 2021 01:35 IST

దిల్లీ: శ్రీరామ్‌ ప్రోపర్టీస్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) 8న ప్రారంభమై 10న ముగియనుంది. ఇష్యూ ద్వారా రూ.600 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. తాజా షేర్ల జారీ ద్వారా రూ.250 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో రూ.350 కోట్లు సమీకరించనుంది. ప్రస్తుత పెట్టుబడిదార్లలో 58% వాటా ఉన్న టీపీజీ క్యాపిటల్‌, టాటా క్యాపిటల్‌, వాల్టన్‌ స్ట్రీట్‌ క్యాపిటల్‌, స్టార్‌వుడ్‌ క్యాపిటల్‌లు పాక్షికంగా వాటాల్ని ఈ ఐపీఓలో విక్రయించనున్నాయి. ఐపీఓ ద్వారా లభించే నిధులతో రుణాలు చెల్లింపు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగిస్తామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని