10 ఏళ్లు.. రూ.లక్ష కోట్లు

భారత్‌ భవిత అద్భుతంగా ఉండబోతోందని, దేశ యువ వ్యాపారవేత్తల సంకల్ప బలాన్ని తాను నమ్ముతున్నానని సాఫ్ట్‌బ్యాంక్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) మసయోషి సన్‌ తెలిపారు.  గత పదేళ్లలో

Published : 04 Dec 2021 01:36 IST

 భారత్‌లో అధిక విదేశీ పెట్టుబడులు మావే

 సాఫ్ట్‌బ్యాంక్‌ సీఈఓ మసయోషి సన్‌

దిల్లీ: భారత్‌ భవిత అద్భుతంగా ఉండబోతోందని, దేశ యువ వ్యాపారవేత్తల సంకల్ప బలాన్ని తాను నమ్ముతున్నానని సాఫ్ట్‌బ్యాంక్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) మసయోషి సన్‌ తెలిపారు.  గత పదేళ్లలో భారత్‌లో 1400 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.05 లక్షల కోట్ల) పెట్టుబడితో, అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా నిలిచామని ఇన్ఫినిటీ ఫోరమ్‌ నిర్వహించిన ఓ సదస్సులో సన్‌ వెల్లడించారు.  ఈ ఏడాదిలోనే 300 కోట్ల డాలర్లు (సుమారు రూ.22,500 కోట్లు) పెట్టుబడిగా అందించామని చెప్పారు. భారత విపణిలో పెట్టుబడులకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. భారత్‌లోని అన్ని ‘యూనికార్న్‌’ (రూ.7500 కోట్ల విలువైన సంస్థ)లకు సుమారు 10 శాతం నిధులు ఇచ్చామని చెప్పారు. కొన్నేళ్లుగా పలు దేశీయ సంస్థల్లో సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్టుబడులు పెడుతోంది. ఇందులో పేటీఎం, ఓలా, డెలివరీ, ఫ్లిప్‌కార్ట్‌, మీషో లాంటివి ఉన్నాయి. భారత్‌లో ఉన్న అద్భుత అవకాశాలను అందుపుచ్చుకునేందుకు ప్రయత్నించాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. వారికి తమ సహకారం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. సాఫ్ట్‌బ్యాంక్‌ ఇప్పటివరకు పెట్టుబడులు పెట్టిన పలు సంస్థలు సుమారు 10 లక్షల ఉద్యోగాలను సృష్టించాయని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని