భారత కంపెనీలకు సహకారం అందిస్తాం

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

దిల్లీ: ఓపెన్‌ ఇంటర్నెట్‌, నిబంధనల మధ్య సమతుల్యత ముఖ్యమని.. ఆలోచనలను పరస్పరం పంచుకునేందుకు, అవకాశాల సృష్టికి ఇది దోహదం చేస్తుందని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ అభిప్రాయపడ్డారు. క్లౌడ్‌, ఏఐ, ఆండ్రాయిడ్‌ విభాగంలో వివిధ కార్యకలాపాల ద్వారా భారత విపణి వృద్ధికి సహకారం అందించేందుకు గూగుల్‌ కట్టుబడి ఉందని హెచ్‌టీ లీడర్‌షిప్‌ సదస్సులో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ‘ప్రజల జీవన విధానంలో సాంకేతికత వినియోగం పెరిగింది. సహజంగానే నిబంధనలు అవసరం అవుతాయి. వీటి రూపకల్పనలో దేశాలు తమ పౌరుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా.. వాళ్లకు అవి తప్పకుండా ప్రయోజనాన్ని కలిగించేలా ఉండాలి’ అని పిచాయ్‌ చెప్పారు. ‘స్థానికతకు ప్రాధాన్యమివ్వడం గూగుల్‌కు ఎంతో ముఖ్యం. ప్రతి దేశంలో ఆ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. అందుకే ప్రతి దేశంలోనూ స్థానికతకు పెద్దపీట వేసేందుకు, స్థానిక చట్టాలకు అనుగుణంగా నడుచుకునేందుకు గూగుల్‌ కట్టుబడి ఉంద’ని పిచాయ్‌ చెప్పారు. అంతర్జాతీయంగా భారత కంపెనీలు తామేంటో నిరూపించుకుంటుండటం, యూనికార్న్‌లుగా అవతరించడం ప్రోత్సాహకర పరిణామమని చెప్పారు. తాము కూడా పలు మార్గాల్లో సహకారం అందిస్తున్నామని, భారత డిజిటైజేషన్‌ పథకాల్లో 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని  పిచాయ్‌ పేర్కొన్నారు. భారత కంపెనీలకు సహకారం అందించడంతో పాటు ఏఐ, సాంకేతికతలను వాళ్లకు అందించాలని అనుకుంటున్నామని తెలిపారు. తద్వారా ఆ కంపెనీలు వాటి ఆలోచనలకు కార్యరూపంలోకి తీసుకు రాగలుతాయని, మరింత మంది వినియోగదార్లకూ చేరువవుతాయని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని