విద్యుత్‌ వాహనాల ఛార్జర్లపై ఆరాయ్‌ దృష్టి

విద్యుత్‌ వాహనాల కోసం వేగవంతమైన ఛార్జర్లను అభివృద్ధి చేయడానికి ఆటోమోటివ్‌ పరిశోధన, అభివృద్ధి సంఘం ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆరాయ్‌) కృషి చేస్తోందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే వెల్లడించారు. పుణెకు చెందిన ఈ స్వయంప్రతిపత్త

Published : 05 Dec 2021 02:40 IST

కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి పాండే

గోవా: విద్యుత్‌ వాహనాల కోసం వేగవంతమైన ఛార్జర్లను అభివృద్ధి చేయడానికి ఆటోమోటివ్‌ పరిశోధన, అభివృద్ధి సంఘం ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆరాయ్‌) కృషి చేస్తోందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే వెల్లడించారు. పుణెకు చెందిన ఈ స్వయంప్రతిపత్త సంస్థ ఇప్పటికే ఒక నమూనాను అభివృద్ధి చేసిందన్నారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ నిర్వహించిన ‘రౌండ్‌ టేబుల్‌ టూ ప్రమోట్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ’ సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘విద్యుత్‌ వాహన బ్యాటరీల ఛార్జింగ్‌కు చాలా అధిక సమయం పడుతోంది. దీనిపై పనిచేయాల్సిందిగా ఆరాయ్‌ను ఆదేశించాం. ఇప్పటికే వేగవంతమైన ఛార్జర్‌ నమూనాను సంస్థ అభివృద్ధి చేసింది. 2022 డిసెంబరుకు ఇది సిద్ధమయ్యే అవకాశం ఉంది’ అని పాండే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను 2022 అక్టోబరుకు పూర్తి చేయాల్సిందిగా ఆరాయ్‌ను కోరారు. ఇది పూర్తయితే డిసెంబరుకు వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. వేగవంతమైన ఛార్జర్లు వస్తే ఛార్జింగ్‌ సమస్యలు తగ్గి.. విద్యుత్‌ వాహనాలకు గిరాకీ పెరుగుతుందని పాండే పేర్కొన్నారు. వీటిపై ఇంకా పరిశోధన జరుగుతోందని, ఇది పూర్తయితే విద్యుత్‌ ద్విచక్ర, త్రిచక్ర, కార్ల ఛార్జింగ్‌కు పట్టే సమయం తెలుస్తుందని వివరించారు. దేశవ్యాప్తంగా 22,000 పెట్రోల్‌ బంకుల్లో ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర పెట్రోలియం శాఖతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 70,000 బంకులు ఉన్నాయని, హైవేలపై 25 కి.మీ దూరంలో, నగరాల్లో 3 కి.మీ దూరంలో ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నట్లు పాండే వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని