రూ.1,000 కోట్ల సమీకరణలోఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌

బాండ్ల పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.1,000 కోట్ల వరకు సమీకరించనున్నట్లు ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ప్రకటించింది. డిసెంబరు 9న ప్రారంభం కానున్న ఈ ఇష్యూ 20 తేదీన ముగియనుంది.

Published : 05 Dec 2021 02:44 IST

దిల్లీ: బాండ్ల పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.1,000 కోట్ల వరకు సమీకరించనున్నట్లు ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ప్రకటించింది. డిసెంబరు 9న ప్రారంభం కానున్న ఈ ఇష్యూ 20 తేదీన ముగియనుంది. సెక్యూర్డ్‌ రెడీమబుల్‌ మార్పిడి రహిత డిబెంచర్లు (ఎన్‌సీడీలు)తో కూడిన ఈ బాండ్ల ఇష్యూ ప్రాథమిక పరిమాణం రూ.200 కోట్లు. అధిక స్పందన వస్తే రూ.800 కోట్ల వరకు పెంచుకునే సౌలభ్యం ఉండటంతో మొత్తం ఇష్యూ విలువ రూ.1,000 కోట్ల వరకు ఉంటుందని కంపెనీ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని