30న డిష్‌ టీవీ ఏజీఎం

పలుమార్లు వాయిదాల అనంతరం డిసెంబరు 30న వార్షిక సాధారణ సమావేశాన్ని (ఏజీఎం) నిర్వహించేందుకు ఎస్సెల్‌ గ్రూపు సంస్థ డిష్‌ టీవీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబరు 3న డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుందని ఎక్స్ఛేంజీలకు కంపెనీ సమాచారమిచ్చింది.

Published : 05 Dec 2021 02:54 IST

దిల్లీ: పలుమార్లు వాయిదాల అనంతరం డిసెంబరు 30న వార్షిక సాధారణ సమావేశాన్ని (ఏజీఎం) నిర్వహించేందుకు ఎస్సెల్‌ గ్రూపు సంస్థ డిష్‌ టీవీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబరు 3న డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుందని ఎక్స్ఛేంజీలకు కంపెనీ సమాచారమిచ్చింది. బోర్డును పునర్‌వ్యస్థీకరించాలంటూ అత్యధిక వాటాదారైన యెస్‌ బ్యాంక్‌ నుంచి డిమాండు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. బోర్డు నుంచి మేనేజింగ్‌ డైరెక్టరు జవహర్‌ గోయల్‌ సహా మరో నలుగురు డైరెక్టర్లను తొలగించాలంటూ డిష్‌ టీవీకి యెస్‌బ్యాంకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వినతిని డిష్‌ టీవీ తిరస్కరించడంతో ఎన్‌సీఎల్‌టీని యెస్‌ బ్యాంక్‌ ఆశ్రయించింది. డిష్‌ టీవీలో యెస్‌ బ్యాంక్‌కు 24.19 శాతం వాటా ఉంది. డిష్‌ టీవీ ఏజీఎం తొలుత సెప్టెంబరు 27, 2021న జరగాల్సి ఉంది. అయితే రెండు నెలలు పొడిగించుకునేందుకు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అవకాశం కల్పించడంతో ఆ సమయంలో దానిని వాయిదా వేసింది. తిరిగి నవంబరు 30, 2021న జరగాల్సి ఉండగా.. ఈసారీ వాయిదా వేస్తున్నట్లు నవంబరు 29న ప్రకటించింది. ఈ పరిణామాలన్నింటి తర్వాత డిసెంబరు 30న సమావేశం నిర్వహించేందుకు తాజాగా డిష్‌ టీవీ బోర్డు నిర్ణయించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని