కేసుల సత్వర పరిష్కారంతోనే  అక్రమ కార్యకలాపాల నియంత్రణ

డీఆర్‌ఐ వార్షికోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: ప్రతి ఒక్క కేసును వివేచనతో పరిష్కరించి, వేగంగా శిక్షలు పడేటట్లు చేస్తేనే.. అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిలో భయం ఏర్పడుతుందని ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. తద్వారా అక్రమ రవాణా సహ పలు ఆర్థిక నేరాలను నియంత్రించవచ్చని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) 64వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. వేగంగా కేసులకు ముగింపు పలికితే అక్రమ రవాణా కార్యకలాపాలను ప్రోత్సహించే వారిపై ఒత్తిడిని పెంచినట్లు అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డులోని (సీబీడీటీ) డీఆర్‌ఐ.. అక్రమ రవాణా కార్యకలాపాల నియంత్రణపై పనిచేసే భారత ప్రభుత్వ ఇంటెలిజెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థ. ఏదేని సమాచారం అందితే తక్షణమే కార్యాచరణలోకి దిగేందుకు అవసరమైన సామర్థ్యాన్ని పెంచుకోవడంపైనా దృష్టి పెట్టాలని ఆమె చెప్పారు. ‘మీకు చాలా సమాచారం (ఇంటెలిజెన్స్‌ ఇన్‌పుట్‌) అందుతుంటుంది. అయితే ఫలానా సమాచారంపై వెంటనే రంగంలోకి దిగాలా వద్దా అనేది గుర్తించడం కష్టంగా ఉంటుంది. సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంద’ని సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. అక్రమ కార్యకలాపాలను నియంత్రించేందుకు ఎలాంటి విధానాలు అవసరమనే దానిపై డీఆర్‌ఐ లాంటి సంస్థలు తమకున్న అనుభవంతో సలహాలు ఇవ్వచ్చని ఆమె చెప్పారు. అక్రమ కార్యకలాపాలను నిరోధించేందుకు, గుర్తించేందుకే కాకుండా నియంత్రించే ప్రయత్నాలనూ చేయొచ్చని తెలిపారు. డీఆర్‌ఐ సాధించే విజయాలపై ప్రసార మాధ్యమాలూ అధిక ప్రాధాన్యమిచ్చి ప్రచారం చేస్తే అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే వీలుంటుందని మంత్రి వివరించారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని