చిన్న వ్యాపారాలకు సులభంగా రుణాలు

చెల్లింపులకు ఎంతో అనువుగా ఉన్న యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) తరహాలో, చిన్న వ్యాపారా (ఎంఎస్‌ఎంఈ)లకు సులభంగా రుణాలు అందించేందుకు పటిష్ఠమైన, ఎలాంటి అవరోధాలు లేని సరికొత్త డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను

Published : 06 Dec 2021 02:17 IST

 అందుకనువైన డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ సిద్ధం చేయండి
 బ్యాంకులకు కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సూచన

దిల్లీ: చెల్లింపులకు ఎంతో అనువుగా ఉన్న యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) తరహాలో, చిన్న వ్యాపారా (ఎంఎస్‌ఎంఈ)లకు సులభంగా రుణాలు అందించేందుకు పటిష్ఠమైన, ఎలాంటి అవరోధాలు లేని సరికొత్త డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాలని బ్యాంకులకు కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విజ్ఞప్తి చేశారు. అలాంటి ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసేందుకు అనువైన వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆధార్‌, మొబైల్‌ ఫోన్‌, యూపీఐ ప్లాట్‌ఫామ్‌, డిజిలాకర్‌ వంటి వాటిని వినియోగించుకుని వినూత్న ఆలోచనతో 3 నెలల్లో తమ ముందుకు రావాలని బ్యాంకింగ్‌ పరిశ్రమకు సూచించారు. డిజిటల్‌ రంగంలో భారత్‌ సాధించిన ప్రగతిని చూపించడం కోసం వారం రోజులుగా నిర్వహిస్తున్న ‘అజాదీ కా డిజిటల్‌ మహోత్సవ్‌’లో భాగంగా ఏర్పాటు చేసిన ‘డిజిటల్‌ పేమెంట్‌ ఉత్సవ్‌’ కార్యక్రమంలో వైష్ణవ్‌ మాట్లాడారు. సమాజంలో కింది స్థాయిలో ఉన్న వారికి, వీధి వ్యాపారులకు సులభంగా రుణ సదుపాయం కల్పించేందుకు బలమైన, వినూత్న ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేయాలని బ్యాంకులను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని