
Published : 06 Dec 2021 02:17 IST
3 కోట్లకు పైగా ఐటీ రిటర్నుల దాఖలు
ఈనెల 31 వరకు గడువు
దిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికి 3 కోట్లకు పైగా ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నులు దాఖలయ్యాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈనెల 31 వరకు వీటి సమర్పణకు గడువు ఉందని తెలిపింది. ఇప్పటివరకు సమర్పించిన 3.03 కోట్ల ఐటీఆర్‌లలో ఐటీఆర్-1లు 1.78 కోట్లు (58.98%), ఐటీఆర్-2లు 24.42 లక్షలు, ఐటీఆర్-3లు 26.58 లక్షలు, ఐటీఆర్-4లు 70.07 లక్షలు, ఐటీఆర్-5లు 2.14 లక్షలు, ఐటీఆర్-6లు 91,000, ఐటీఆర్-7లు 15,000 ఉన్నాయని పేర్కొంది.
Tags :