
Published : 07 Dec 2021 01:42 IST
అత్యధిక ఫారెక్స్ నిల్వల్లో మనకు నాలుగో స్థానం
దిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక విదేశీ మారకపు నిల్వలు కలిగిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు. నవంబరు 19, 2021 నాటికి మన విదేశీ మారకపు నిల్వల మొత్తం 640.4 బిలియన్ డాలర్లకు చేరుకుందని సోమవారం లోక్‌సభకు తెలిపారు. పీ నోట్లు/ఆఫ్‌షోర్ డెరివేటివ్ ఇన్‌స్ట్రుమెంట్లు(ఓడీఐలు), ఓడీఐల ప్రయోజనాలు పొందే యజమానులు నెలవారీగా సెబీకి వివరాలు అందిస్తుంటారని పేర్కొన్నారు. సెబీ కోరినపుడల్లా ఓడీఐలను జారీ చేసే విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు(ఎఫ్‌పీఐలు) తమ వద్ద ఓడీఐ ఖాతాదార్ల వివరాలకు సంబంధించిన కేవైసీ పత్రాలను అందించాల్సి ఉంటుంది.
Tags :