‘సోషల్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌’కు శ్రీకారం

సిటీ, ఐఐటీ- కాన్పూర్‌, టీ-హబ్‌ కలిసి సోషల్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ను ప్రారంభించాయి. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్‌ విభాగాలపై ప్రభావం

Published : 07 Dec 2021 02:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: సిటీ, ఐఐటీ- కాన్పూర్‌, టీ-హబ్‌ కలిసి సోషల్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ను ప్రారంభించాయి. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్‌ విభాగాలపై ప్రభావం చూపగల అంకుర సంస్థలను గుర్తించి, వాటికి అన్ని రకాలుగా అండగా నిలవడం ఈ ల్యాబ్‌ ప్రధాన లక్ష్యం. ప్రాథమిక, వృద్ధి దశల్లో ఉన్న అంకుర సంస్థలను ఎంపిక చేసి వాటి వ్యాపార ప్రణాళిక, వృద్ధి అవకాశాలను పరిశీలించి తుది జాబితా తయారు చేస్తారు. ఈ  సంస్థలకు సిటీ, ఐఐటీ- కాన్పూర్‌, టి-హబ్‌ మెంటారింగ్‌ సేవలతో పాటు, వ్యాపార ప్రణాళిక రూపొందించటం, గో-టూ మార్కెట్‌ వ్యూహాన్ని ఆవిష్కరించడం, నిధులు సమకూర్చడం, వృద్ధి అవకాశాలను గుర్తించటం.. ఇలా అన్ని రకాలుగా మద్దతు ఇస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని