
Published : 07 Dec 2021 02:25 IST
రూ.100 కోట్లతో విటెరో టైల్స్ విస్తరణ
ఈనాడు, హైదరాబాద్: బిల్డింగ్ మెటీరియల్స్ తయారీ సంస్థ అపర్ణ ఎంటర్‌ప్రైజెస్, టైల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు రూ.100 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దాపురంలో ఈ సంస్థకు ఉన్న యూనిట్లో విటెరో టైల్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని ప్రస్తుత 15,000 చదరపు మీటర్ల నుంచి 30,000 చ.మీ.కు పెంచుకోవడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా విపణుల్లో అధిక వాటా సంపాదించే అవకాశం కలుగుతుందని అపర్ణ ఎండీ అశ్విన్‌రెడ్డి తెలిపారు.
Tags :