రెయిన్‌ ఇండస్ట్రీస్‌లో పబ్రాయ్‌ వాటా 8%

హైదరాబాద్‌కు చెందిన సీపీసీ (క్యాల్సినేటెడ్‌ పెట్‌ కోక్‌), సిమెంటు ఉత్పత్తి చేసే సంస్థ రెయిన్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌లో అమెరికాకు చెందిన పబ్రాయ్‌....

Published : 07 Dec 2021 02:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన సీపీసీ (క్యాల్సినేటెడ్‌ పెట్‌ కోక్‌), సిమెంటు ఉత్పత్తి చేసే సంస్థ రెయిన్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌లో అమెరికాకు చెందిన పబ్రాయ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ తన వాటా పెంచుకుంది. ఈ సంస్థకు ఇప్పటికే రెయిన్‌ ఇండస్ట్రీస్‌లో 5.95 శాతం వాటా (దాదాపు 2 కోట్ల షేర్లు) ఉండగా, అదనంగా 2.05 శాతం వాటాను (68.98 లక్షల షేర్లు) ఈ నెల 2న స్టాక్‌మార్కెట్లో కొనుగోలు చేసింది. దీంతో రెయిన్‌ ఇండస్ట్రీస్‌లో పబ్రాయ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌కు ఉన్న వాటా 8 శాతానికి పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని