
రూ.40 లక్షల నుంచి ఆడి ఏ-4
దిల్లీ: జర్మనీకి చెందిన కార్లతయారీ కంపెనీ ఆడి తన ఏ-4 సెడాన్‌లో ప్రారంభ స్థాయి వేరియంట్ ఏ4 ప్రీమియంను తీసుకొచ్చింది. దీని ధర రూ.39.99 లక్షలు(ఎక్స్ షోరూం). ప్రస్తుతమున్న ఏ4 ప్రీమియం ప్లస్, ఏ4 టెక్నాలజీ వేరియంట్‌లకు ఇది అదనం. 2 లీటర్ పెట్రోలు ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు 140 కి.వాట్(190 హెచ్‌పీ) పవర్‌ను, 320 ఎన్‌ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుందని ఆడి ఇండియా పేర్కొంది. ‘జనవరిలో ఏ4ను విడుదల చేసినప్పటి నుంచి అద్భుత స్పందన వచ్చిందని..తాజా ఆవిష్కరణతో మరింత మంది వినియోగదార్లు ఆడి కుటుంబంలోకి చేరతార’ని ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ థిల్లాన్ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.