
నూతన ఉత్పత్తులకు రూ.150 కోట్లు!
ఈనాడు, హైదరాబాద్: ప్యాకేజింగ్ ఉత్పత్తుల కంపెనీ మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ తన విస్తరణ అవసరాల కోసం రూ.150 కోట్లు సమీకరించే ఆలోచన చేస్తోంది. క్యూఐపీ (అర్హత కలిగిన సంస్థాగత మదుపుదార్ల) పద్ధతిలో నిధులు సమీకరించాలని భావిస్తున్నట్లు మోల్డ్‌టెక్ వర్గాలు వెల్లడించాయి. ప్యాకేజింగ్‌లో సరికొత్త పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్నాయని, దాన్ని అందిపుచ్చుకుని కొత్త ప్యాకేజింగ్ ఉత్పత్తులు తీసుకురావాలనేది తమ ఉద్దేశమని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.