జీఎస్‌ఎస్‌ ఇన్ఫోటెక్‌ చేతికి ‘పొలిమేరాస్‌’

రైతుల నుంచి కూరగాయలు సేకరించి నేరుగా వినియోగదార్లకు విక్రయించే ‘పొలిమేరాస్‌’ అనే సంస్థను హైదరాబాద్‌కు చెందిన జీఎస్‌ఎస్‌ ఇన్ఫోటెక్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేసింది.

Updated : 07 Dec 2021 05:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: రైతుల నుంచి కూరగాయలు సేకరించి నేరుగా వినియోగదార్లకు విక్రయించే ‘పొలిమేరాస్‌’ అనే సంస్థను హైదరాబాద్‌కు చెందిన జీఎస్‌ఎస్‌ ఇన్ఫోటెక్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేసింది. రూ.250 కోట్ల సంస్థాగత విలువకు దీన్ని సొంతం చేసుకున్నట్లు జీఎస్‌ఎస్‌ ఇన్ఫోటెక్‌ వెల్లడించింది. ఇందుకు కొంత నగదు చెల్లించడంతో పాటు మిగిలిన మొత్తానికి ఈక్విటీ షేర్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. అన్ని రకాల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాలనేది తమ ఉద్దేశమని, ఇందులో భాగంగా ‘పొలిమేరాస్‌’ను కొనుగోలు చేసినట్లు జీఎస్‌ఎస్‌ ఇన్ఫోటెక్‌ జీఈఓ భార్గవ్‌ మారుపల్లి వివరించారు. హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో 75 విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న ‘పొలిమేరాస్‌’, ఈ సంఖ్యను 100కు పెంచుకోవాలనే ఆలోచన ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని