రూ.2000 నోట్లు బాగా తగ్గాయ్‌

దేశీయంగా చెలామణీలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో రూ.2000 నోట్ల వాటా నవంబరులో 1.75 శాతానికి పడిపోయింది. 2000 రూపాయల నోట్లు 223.30 కోట్ల సంఖ్యలో ప్రస్తుతం చెలామణీలో ఉన్నాయి. విలువ పరంగా వీటి వాటా 15.11 శాతానికి పరిమితమైంది.

Published : 08 Dec 2021 02:23 IST

మొత్తం నోట్లలో వీటి వాటా 1.75 శాతమే
2018 మార్చిలో 3.27 శాతం చెలామణీ

దిల్లీ: దేశీయంగా చెలామణీలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో రూ.2000 నోట్ల వాటా నవంబరులో 1.75 శాతానికి పడిపోయింది. 2000 రూపాయల నోట్లు 223.30 కోట్ల సంఖ్యలో ప్రస్తుతం చెలామణీలో ఉన్నాయి. విలువ పరంగా వీటి వాటా 15.11 శాతానికి పరిమితమైంది. 2018 మార్చిలో 2000 రూపాయల నోట్లు 336.3 కోట్ల మేర (మొత్తం నోట్లలో 3.27 శాతం) చెలామణిలో ఉండగా, విలువ పరంగా 37.26 శాతానికి సమానంగా ఉండేది. ఈ సమాచారాన్ని రాజ్యసభలో ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి పేర్కొన్నారు. ‘ఆర్‌బీఐతో చర్చించి ఏ నోట్లు ఎన్ని ముద్రించాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రజలు నిర్వహించే లావాదేవీల గిరాకీకి తగ్గట్లు అవి ఉంటాయ’ని ఆయన తెలిపారు.  2018-19 తర్వాత రూ.2000 నోట్లను ముద్రించకపోవడం, కొన్ని నోట్లు చిరిగి/పనికిరానందున  చెలామణీ నుంచి తొలగించడం ఇందుకు కారణాలు.  

ప్రభుత్వ రంగ బ్యాంకుల రికవరీ రూ.4.18 లక్షల కోట్లు

గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మోసాలు, ఎగవేతలకు సంబంధించిన రూ.4.18 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు రికవరీ చేశాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ రాజ్యసభకు తెలిపారు. ఇదే సమయంలో రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిగే మోసాలు తగ్గాయని తెలిపారు. ఎగవేతదారుల నుంచి బకాయిలు రాబట్టడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని