‘ఒమిక్రాన్‌’కు జీఎస్‌కే మందు

కరోనా వైరస్‌ ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌పై తాము అభివృద్ధి చేసిన యాంటీబాడీ ఆధారిత చికిత్స సత్ఫలితాలు ఇస్తున్నట్లు అగ్రశ్రేణి ఔషధ సంస్థ జీఎస్‌కే (గ్లాక్సో స్మిత్‌ క్లైన్‌) వెల్లడించింది. అమెరికాలోని తన భాగస్వామి వీర్‌ బయోటెక్నాలజీతో

Published : 08 Dec 2021 02:23 IST

దిల్లీ: కరోనా వైరస్‌ ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌పై తాము అభివృద్ధి చేసిన యాంటీబాడీ ఆధారిత చికిత్స సత్ఫలితాలు ఇస్తున్నట్లు అగ్రశ్రేణి ఔషధ సంస్థ జీఎస్‌కే (గ్లాక్సో స్మిత్‌ క్లైన్‌) వెల్లడించింది. అమెరికాలోని తన భాగస్వామి వీర్‌ బయోటెక్నాలజీతో కలిసి ‘సొట్రొవిమ్యాబ్‌’ అనే ఔషధంతో ఈ యాంటీబాడీ చికిత్సను ఆవిష్కరించినట్లు జీఎస్‌కే తెలిపింది. ‘సొట్రొవిమ్యాబ్‌’ ప్రభావశీలతను ఒమిక్రాన్‌ కీలక మ్యుటేషన్లపైనా గుర్తించినట్లు జీఎస్‌కే వివరించింది. క్లినికల్‌ పరీక్షల్లో ఇది చూపిన ఫలితాలను అగ్రశ్రేణి వైద్య పత్రికలు సమీక్షించాల్సి (పీర్‌-రివ్యూ) ఉంది. ఇప్పటి వరకు గుర్తించిన 37 రకాలైన కరోనా వైరస్‌ రకాలపై (వేరియంట్లు) ఈ ఔషధం బాగా పనిచేస్తోందని జీఎస్‌కే పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని