
బ్రైట్‌కామ్ గ్రూపు చేతికి ‘మీడియామింట్’
ఈనాడు, హైదరాబాద్: ‘మీడియామింట్’ బ్రాండు పేరుతో డిజిటల్ కన్సల్టింగ్ సేవలు అందిస్తున్న వుచి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో 100 శాతం వాటాను రూ.566 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు హైదరాబాద్‌లోని డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ విభాగానికి చెందిన బ్రైట్‌కామ్ గ్రూపు ప్రకటించింది. రూ.360 కోట్ల మొత్తాన్ని నగదు రూపంలో చెల్లిస్తారు. రూ.170 కోట్లకు బ్రైట్‌కామ్ గ్రూపు షేర్లు జారీ చేస్తారు. మిగిలిన రూ.36 కోట్లను 6 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. ప్రకటనల కార్యకలాపాలు, ప్రచార నిర్వహణ, వినూత్న సేవలు, డేటా అనలిటిక్స్, ప్లాట్‌ఫామ్ మద్దతు, డెవలప్మెంట్ కార్యకలాపాలను ‘మీడియామింట్’ నిర్వహిస్తోంది. దీన్లో 1300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పింటరెస్ట్, న్యూయార్క్ టైమ్స్, నెట్‌ఫ్లిక్స్, కాక్స్ ఆటోమోటివ్, ఎక్స్పీడియా.. వంటి క్లయింట్లు దీనికి ఉన్నారు. ఈ కొనుగోలు తర్వాతా ‘మీడియామింట్’ లీడర్షిప్ బృందంలోని నీలిమ మారుపూరు, అనూష్కుమార్, జాసన్ రైబ్యాక్, ఆషే పరాడ్కర్ యథాతథంగా కొనసాగుతారని, సహవ్యవస్థాపకుడైన ఆదిత్య వుచి మాత్రం 6 నెలలు ఉంటారని బ్రైట్‌కామ్ గ్రూపు తెలియజేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.