Published : 08 Dec 2021 02:22 IST

అంతర్జాతీయ సందేశాల భద్రతకు వొడాఫోన్‌ ఐడియాతో తాన్లా ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ సేవల సంస్థ తాన్లా ప్లాట్‌ఫామ్స్‌, టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా కలిసి అంతర్జాతీయ మెసేజింగ్‌ ట్రాఫిక్‌ను సురక్షితంగా నిర్వహించేందుకు ఉమ్మడి భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే సందేశాల మార్కెట్‌ విలువ దాదాపు రూ.3,500 కోట్ల మేరకు ఉంటుందని అంచనా. అంతర్జాతీయ సంస్థల డిజిటల్‌ లావాదేవీలకు సంబంధించిన సమాచారానికి మరింత రక్షణ కల్పించేందుకు, ఎన్‌క్రిప్ట్‌ చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యంతో వైస్‌లీ అనే క్లౌడ్‌ ఆధారిత ఫ్లాట్‌ఫాంను అభివృద్ధి చేసినట్లు తాన్లా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఇది అందుబాటులోకి రానుందని పేర్కొంది. అంతర్జాతీయ డిజిటల్‌ వ్యవహారాల విభాగంలో వొడాఫోన్‌ ఐడియా, వైస్‌లీ ప్లాట్‌ఫాంతో కలిసి పనిచేయడం ఒక కీలక అడుగు అని తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ ఛైర్మన్‌, సీఈఓ ఉదయ్‌ రెడ్డి అన్నారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని