రూ.3,750 కోట్ల పబ్లిక్‌ ఇష్యూ

చేనేత వస్త్రాలు, ఫర్నీచర్‌ విక్రయ సంస్థ ఫ్యాబ్‌ ఇండియా వచ్చే ఏడాది పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. సుమారు రూ.3,750 కోట్లు (50 కోట్ల డాలర్లు) సమీకరించాలని భావిస్తోందని సమాచారం.

Published : 08 Dec 2021 02:22 IST

సన్నాహాల్లో ఫ్యాబ్‌ ఇండియా

దిల్లీ: చేనేత వస్త్రాలు, ఫర్నీచర్‌ విక్రయ సంస్థ ఫ్యాబ్‌ ఇండియా వచ్చే ఏడాది పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. సుమారు రూ.3,750 కోట్లు (50 కోట్ల డాలర్లు) సమీకరించాలని భావిస్తోందని సమాచారం. సెబీకి ఈ మేరకు దరఖాస్తు పత్రాలను నూతన సంవత్సరంలో సమర్పించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత వాటాదార్లే ఇష్యూలో ఎక్కువ భాగం షేర్లను విక్రయించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కంపెనీ విలువను 200 కోట్ల డాలర్లు (సుమారు రూ.15,000 కోట్లు)గా లెక్కగట్టాలని ఫ్యాబ్‌ ఇండియా కోరుతోంది. ఈ సంస్థలో విప్రో వ్యవస్థాపకులు అజీమ్‌ ప్రేమ్‌జీకి చెందిన ప్రేమ్‌జీఇన్వెస్ట్‌ పెట్టుబడులు కూడా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని