సంక్షిప్త వార్తలు

హెల్తియమ్‌ యూనిట్‌కు యూఎస్‌ గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: హెల్తియమ్‌ మెడ్‌టెక్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలోని యూనిట్‌కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) రిజిస్ట్రేషన్‌ లభించింది. ఈ సంస్థ సర్జికల్‌, పోస్ట్‌-సర్జికల్‌, క్రానిక్‌ కేర్‌ విభాగాలకు అవసరమైన వైద్య పరికరాలు ఉత్పత్తి చేస్తోంది. శ్రీసిటీలోని  యూనిట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ రిజిస్ట్రేషన్‌ లభించటంతో తాము అనుసరించే నాణ్యతా ప్రమాణాలకు గుర్తింపు లభించినట్లు అయ్యిందని హెల్తియమ్‌ మెడ్‌టెక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ అనీష్‌ బాఫ్నా వివరించారు. శ్రీసిటీ యూనిట్‌ను ఈ సంస్థ 2012లో ప్రారంభించింది.

జెన్‌ టెక్‌ అనుబంధ సంస్థకు రూ.61 కోట్ల ఆర్డర్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన జెన్‌ టెక్నాలజీస్‌ అనుబంధ సంస్థ, యూనిస్ట్రింగ్‌ టెక్‌ సొల్యూషన్స్‌ (యూటీఎస్‌) కు రక్షణ రంగంలోని ఒక ప్రభుత్వ సంస్థ నుంచి రూ.61 కోట్ల విలువైన ఆర్డర్‌ లభించింది. ఈ సంస్థ ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌, కౌంటర్‌- డ్రోన్‌ టెక్నాలజీస్‌ అభివృద్ధి చేస్తోంది. ఈ ఆర్డర్‌ లభించడంపై యూటీఎస్‌ ఎండీ డాక్టర్‌ శ్రావణి శ్రీనివాస్‌ స్పందిస్తూ, ‘ఇది చిన్న అడుగు మాత్రమే, భవిష్యత్తులో ఎంతో పెద్ద ఆర్డర్లు సాధిస్తాం’ అని పేర్కొన్నారు. యూటీఎస్‌లో జెన్‌ టెక్నాలజీస్‌కు మెజార్టీ వాటా ఉంది.

భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్న ఆక్సీలోన్స్‌.కామ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆక్సీలోన్స్‌.కామ్‌ అనే ప్లాట్‌ఫామ్‌ ద్వారా పీ2పీ (పీర్‌-టు-పీర్‌) రుణాలు జారీ చేసే సంస్థ ఎస్‌ఆర్‌ఎస్‌ ఫిన్‌టెక్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 2023కు రూ.7,000 కోట్ల రుణాలు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ఈ సంస్థ రూ.100 కోట్ల రుణాలు ఇచ్చింది. తాము పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా, సాధించలేనిది కాదని ఎస్‌ఆర్‌ఎస్‌ ఫిన్‌టెక్‌ ల్యాబ్స్‌ సీఈఓ టి.రాధాకృష్ణ బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు. పీ2పీ రుణాల మార్కెట్‌పై ఇప్పుడు ప్రధాన బ్యాంకులు సైతం దృష్టి సారిస్తున్నాయని అన్నారు. అధికంగా రుణాలు జారీ చేసే ఉద్దేశంతో ‘నియో బ్యాంక్‌’ అనే డిజిటల్‌ బ్యాంకును ఆవిష్కరించామని, దీని ద్వారా వ్యక్తులు, కంపెనీలు, వివిధ సంఘాలు, సంస్థలు తమ ద్వారా అప్పులు ఇచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు, ఆర్థిక సలహా సేవల సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు, తద్వారా ఆయా సంస్థల వినియోగదార్ల రుణ అవసరాలు తీర్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. పండుగల సందర్భంలో రుణాల జారీకి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని