వాహన రిటైల్ విక్రయాలు 3 శాతం తగ్గాయ్
నవంబరులో వాహన రిటైల్ విక్రయాలు 3 శాతం మేర తగ్గాయి. చిప్‌ల కొరతకు తోడు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు అన్ని రకాల వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపాయని వాహన డీలర్ల సంఘం ఫాడా వెల్లడించింది. నవంబరులో
నవంబరుపై ఫాడా
దిల్లీ: నవంబరులో వాహన రిటైల్ విక్రయాలు 3 శాతం మేర తగ్గాయి. చిప్‌ల కొరతకు తోడు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు అన్ని రకాల వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపాయని వాహన డీలర్ల సంఘం ఫాడా వెల్లడించింది. నవంబరులో మొత్తం 18,17,600 వాహన రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 2020 ఇదే నెల నాటి 18,68,068 వాహనాలతో పోలిస్తే ఈసారి 2.7 శాతం తగ్గాయి. ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 2,98,213 నుంచి 19.44 శాతం తగ్గి 2,40,234కు పరిమితమయ్యాయి. ద్విచక్రవాహన అమ్మకాలు 14,44,762 నుంచి 14,33,855కు, ట్రాక్టర్ల అమ్మకాలు 50,180 నుంచి 45,629కు తగ్గాయి. వాణిజ్య, త్రిచక్ర వాహనాల అమ్మకాలు నవంబరులో పెరగడం గమనార్హం. ‘దీపావళి, పెళ్లిళ్ల సీజను అయినప్పటికీ నవంబరులోనూ అమ్మకాల్లో క్షీణత నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి పుంజుకునే వరకు విక్రయాలకు ప్రతికూల పరిస్థితులే ఉంటాయ’ని ఫాడా ఫ్రెసిడెంట్ వింకేశ్ గులాటీ తెలిపారు. కార్లకు సెమీ కండక్టర్ల కొరత ప్రభావం కొనసాగుతోందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్