విద్యుత్‌ వాహనం కొనుగోలుకు రూ.3 లక్షల వరకు ప్రోత్సాహకాలు

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా విద్యుత్‌ వాహనాలు కొనుగోలు చేసే తమ ఉద్యోగులకు రూ.3 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ప్రకటించింది.

Published : 28 Dec 2021 04:48 IST

ఉద్యోగులకు ఇవ్వనున్న జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌

దిల్లీ: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా విద్యుత్‌ వాహనాలు కొనుగోలు చేసే తమ ఉద్యోగులకు రూ.3 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ప్రకటించింది.  హరిత ప్రోత్సాహకాల్లో భాగంగా తమ ఉద్యోగుల కోసం జేఎస్‌డబ్ల్యూ విద్యుత్‌ వాహన (ఈవీ) విధానాన్ని సంస్థ ఆవిష్కరించింది. భారత్‌కు చెందిన నేషనలీ డిటర్‌మైన్డ్‌ కాంట్రిబ్యూషన్స్‌ (ఎన్‌డీసీలు), సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సినారియోస్‌ (ఎస్‌డీఎస్‌) ఆఫ్‌ ది ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ)లతో జేఎస్‌డబ్ల్యూ జట్టు కట్టింది. భారత్‌లో ప్రధాన కార్పొరేట్‌ సంస్థ ఇటువంటి పథకాన్ని ప్రకటించడం ఇదే ప్రథమం. ఇందులో భాగంగా విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేసే జేఎస్‌డబ్ల్యూ ఉద్యోగులు రూ.3 లక్షల వరకు ప్రోత్సాహకాలు పొందొచ్చు. జేఎస్‌డబ్ల్యూ కార్యాలయాలు, ప్లాంట్‌ల్లో ఉద్యోగుల కోసం ఉచిత ఛార్జింగ్‌ స్టేషన్‌లు, ప్రత్యేకంగా పార్కింగ్‌ స్లాట్‌లను కంపెనీ ఏర్పాటు చేయనుంది. ముజామిల్‌ రియాజ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని