Apple iphone: ఐఫోన్‌ 14లో సిమ్‌ కార్డు ఉండదు!

యాపిల్‌ మరో వినూత్న ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. సంస్థ కొత్తగా విడుదల చేయబోయే ఐఫోన్‌ 14ను సిమ్‌ కార్డు స్లాట్‌ లేకుండా రూపొందిస్తున్నట్లు టెక్‌ వెబ్‌సైట్‌ మ్యాక్‌రూమర్స్‌ పేర్కొంది. 2023కి సిమ్‌ కార్డు స్లాట్‌ లేని ఐఫోన్‌

Updated : 30 Dec 2021 12:18 IST

దిల్లీ: యాపిల్‌ మరో వినూత్న ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. సంస్థ కొత్తగా విడుదల చేయబోయే ఐఫోన్‌ 14ను సిమ్‌ కార్డు స్లాట్‌ లేకుండా రూపొందిస్తున్నట్లు టెక్‌ వెబ్‌సైట్‌ మ్యాక్‌రూమర్స్‌ పేర్కొంది. 2023కి సిమ్‌ కార్డు స్లాట్‌ లేని ఐఫోన్‌ 15 ప్రో మోడళ్లను యాపిల్‌ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. 2022 సెప్టెంబరు కల్లా ఇ-సిమ్‌ మాత్రమే ఉండే స్మార్ట్‌ఫోన్‌లకు సిద్ధంగా ఉండాలని టెలికాం సంస్థలకు యాపిల్‌ సూచించినట్లు వెబ్‌సైట్‌ పేర్కొంది. రెండు ఇ-సిమ్‌ కార్డులు ఉండే ఫీచర్‌తో కొత్త మోడళ్లు రానున్నట్లు తెలుస్తోంది. 2టీబీ మెమొరీ  సామర్థ్యంతో ఐఫోన్‌ 14 విడుదలవుతుందని, కంపెనీ క్వాడ్‌ లెవెల్‌ సెల్‌ (క్యూఎల్‌సీ) ఫ్లాష్‌ స్టోరేజీని అందిపుచ్చుకోనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని