Reliance: రిలయన్స్‌ చేతికి న్యూయార్క్‌ హోటల్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెంచుతోంది. ఇప్పటికే ఈఐహెచ్‌ లిమిటెడ్‌, స్టోక్‌ పార్క్‌ లిమిటెడ్‌(బ్రిటన్‌)లలో పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థ తాజాగా తన పూర్తి స్థాయి

Published : 09 Jan 2022 13:29 IST

ముంబయి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెంచుతోంది. ఇప్పటికే ఈఐహెచ్‌ లిమిటెడ్‌, స్టోక్‌ పార్క్‌ లిమిటెడ్‌(బ్రిటన్‌)లలో పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థ తాజాగా తన పూర్తి స్థాయి అనుబంధ కంపెనీ ద్వారా అమెరికా (న్యూయార్క్‌)లోని అత్యంత విలాసవంతమైన ఒక హోటల్‌లో మెజారిటీ వాటా సొంతం చేసుకుంది. ‘మాండరిన్‌ ఓరియంటల్‌ న్యూయార్క్‌’ హోటల్‌లో 73.37 శాతం వాటా కొనుగోలు చేయడానికి రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌(ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌) సంతకాలు చేసినట్లు శనివారం వెల్లడించింది. ఈ ఒప్పందం కింద ఆ హోటల్‌లో 73.37 శాతం వాటాను పరోక్షంగా కలిగి ఉన్న కొలంబస్‌ సెంటర్‌ కార్పొరేషన్‌(కేమాన్‌) నుంచి మొత్తం జారీ చేసిన షేరు మూలధనాన్ని ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌ కొనుగోలు చేస్తుంది. ఇందుకు 98.15 మిలియన్‌ డాలర ్ల(దాదాపు రూ.736 కోట్లు)ను వెచ్చించనుంది. ‘మార్చి 2022 చివరికి ఈ లావాదేవీ పూర్తవుతుందని అంచనా. నియంత్రణ సంస్థల అనుమతులు ఆలోపు లభించొచ్చ’ని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో వెల్లడించింది. 2003లో ఏర్పాటైన మాండరిన్‌ ఓరియంటల్‌ న్యూయార్క్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. పలు  అవార్డులను ఇది సొంతం చేసుకుంది కూడా. ఒకవేళ ఈ హోటల్‌లోని ఇతర పెట్టుబడిదారులు కూడా తమ వాటా విక్రయిస్తే, ప్రస్తుత ధరకు అనుగుణంగానే కొనుగోలు చేస్తామని ఆర్‌ఐఎల్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని