Insurance: ‘కాక్టెయిల్ థెరపీ’ క్లెయింలను తిరస్కరించొద్దు
కొవిడ్-19 చికిత్సలో భాగంగా ‘యాంటీబాడీ కాక్టెయిల్ థెరపీ’కీ ఆరోగ్య బీమా వర్తిస్తుందని భారతీయ బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) స్పష్టం చేసింది. బీమా సంస్థలు ఈ చికిత్సను ప్రయోగాత్మకంగా పేర్కొంటూ,
బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ సూచన
దిల్లీ: కొవిడ్-19 చికిత్సలో భాగంగా ‘యాంటీబాడీ కాక్టెయిల్ థెరపీ’కీ ఆరోగ్య బీమా వర్తిస్తుందని భారతీయ బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) స్పష్టం చేసింది. బీమా సంస్థలు ఈ చికిత్సను ప్రయోగాత్మకంగా పేర్కొంటూ, క్లెయింలను తిరస్కరించకూడదని సూచించింది. ఈ చికిత్స తీసుకున్న వారికి క్లెయిం ఇవ్వడం లేదని, లేదా ఆ చికిత్స ఖర్చును మినహాయించి మిగతా మొత్తం చెల్లిస్తున్నారని ఇటీవల కాలంలో నియంత్రణ సంస్థకు ఫిర్యాదులు అందాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఐఆర్డీఏఐ సాధారణ, ఆరోగ్య బీమా సంస్థల సీఎండీ/సీఈఓలకు ఒక సర్క్యులర్‌ను పంపించింది. యాంటీబాడీ కాక్టెయిల్ చికిత్సకు సీడీఎస్సీఓ అత్యవసర వినియోగం కోసం అనుమతిచ్చిన నేపథ్యంలో.. క్లెయింలను తిరస్కరించేందుకు వీల్లేదని తెలిపింది. నిబంధనల ప్రకారం క్లెయింల పరిష్కారం జరిగేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్‌కు వాటా