రూ.3,600 కోట్ల సమీకరణకు అదానీ విల్మర్‌ ఇష్యూ!

రూ.4500 కోట్ల నుంచి తగ్గించిన సంస్థ

దిల్లీ: ప్రతిపాదిత రూ.4,500 కోట్ల ఇష్యూకు బదులుగా రూ.3,600 కోట్ల ఐపీఓతో అదానీ విల్మర్‌ (ఏడబ్ల్యూఎల్‌) ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో సంబంధమున్న వ్యక్తులు ఈ విషయాన్ని తెలిపారు. ఫార్చూన్‌ బ్రాండ్‌పై వంట నూనెలు విక్రయిస్తున్న ఈ కంపెనీ ఈ నెలలోనే పబ్లిక్‌ ఇష్యూకు రావొచ్చని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన అదానీ గ్రూప్‌; సింగపూర్‌కు చెందిన విల్మర్‌ గ్రూప్‌లు చెరిసగం వాటాతో ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థే ఏడబ్ల్యూఎల్‌. కంపెనీ దాఖలు చేసిన ముసాయిదా పత్రాల ప్రకారం.. తాజా షేర్లను జారీ చేయడం ద్వారా రూ.4,500 కోట్లను సమీకరించాలనుకుంది. అయితే సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు సంబంధించిన భాగాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐపీఓ సమీకరణ ద్వారా వచ్చిన నిధుల్లో రూ.1,900 కోట్లను మూలధన వ్యయాలకు; రూ.1,100 కోట్లను రుణ చెల్లింపులకు; రూ.500 కోట్లను వ్యూహాత్మక కొనుగోళ్లు, పెట్టుబడులకు వెచ్చించనున్నారు. తాజా పరిణామంపై స్పందించేందుకు  కంపెనీ ప్రతినిధి నిరాకరించారు. ఇష్యూ పరిమాణం తగ్గించడం మంచి అడుగని.. మూలధనంపై ప్రతిఫలం(ఆర్‌ఓసీఈ); ఈక్విటీపై ప్రతిఫలం(ఆర్‌ఓఈ) మెరుగ్గా రాణించగలవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అదానీ గ్రూప్‌నకు చెందిన ఆరు కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదై ఉన్నాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని