Published : 17 Jan 2022 01:51 IST

సంక్షిప్త వార్తలు

4.2 శాతం పెరిగిన విమాన ఇంధన ధర

దిల్లీ: విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధర 4.2 శాతం మేర పెరిగింది. దిల్లీలో కిలోలీటరుకు రూ.3,232.87 అధికమై రూ.79,294.91కి చేరింది. ఈ నెలలో ధర పెరగడం ఇది రెండోసారి. జనవరి 1న కిలోలీటరుకు రూ.2,039.63 లేదా 2.75 శాతం మేర ఏటీఎఫ్‌ ధర పెరిగింది. అంతర్జాతీయ ముడిచమురు ధరల ఆధారంగా ఏటీఎఫ్‌ ధరను 15 రోజులకొకసారి సమీక్షిస్తుంటారు. నవంబరు మధ్యలో ఏటీఎఫ్‌ ధర గరిష్ఠంగా రూ.80,835.04గా ఉంది.


ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌ పోర్టల్‌లో

డేటా చౌర్యం

దిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ (ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌) పోర్టల్‌లో డేటా చౌర్యం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కంపెనీ దర్యాప్తు జరుపుతోంది. డేటా చౌర్యం వల్ల తమ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండబోదని కంపెనీ హామీ ఇచ్చింది. కంపెనీ ఇ-కామర్స్‌ డేటాబేస్‌లోని 54 లక్షల ఇ-మెయిల్‌ చిరునామాల వివరాలు ఆన్‌లైన్‌లో బహిర్గతమయ్యాయి. దీనిపై దర్యాప్తు చేయడానికి ఫోరెన్సిక్‌ సెక్యూరిటీ నిపుణులను కంపెనీ నియమించింది. షైనీ హంటర్స్‌ పేరుతో హ్యాకర్స్‌ బృందం ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌ డేటాబేస్‌ వివరాలను బయటపెట్టినట్లు వార్తలు వచ్చాయి. సైబర్‌ భద్రతా నిపుణుడు రాజశేఖర్‌ రాజారియా ఈ సమాచారాన్ని వెల్లడించారు.


జోజిలా ప్రాజెక్ట్‌లో 5 కి.మీ. సొరంగ పని పూర్తి: ఎంఈఐఎల్‌

హైదరాబాద్‌: శ్రీనగర్‌ నుంచి లద్దాఖ్‌ మధ్య ఏడాది పొడవునా రాకపోకలు సాగించేందుకు వీలుగా 18 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న జోజిలా ప్రాజెక్ట్‌లో భాగంగా 5 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసినట్లు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) వెల్లడించింది. మొత్తం 18 కి.మీ పొడవున్న జోజిలా సొరంగాల్లో ఇది భాగమని, 14 నెలల రికార్డు సమయంలో దీన్ని పూర్తిచేసినట్లు తెలిపింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ చాలా నిబద్ధతతతో ప్రాజెక్ట్‌ను ఎంఈఐఎల్‌ బృందం పూర్తి చేసిందని జోజిలా ప్రాజెక్ట్‌ హెడ్‌ హర్‌పాల్‌ సింగ్‌ పేర్కొన్నారు.


మారుతీ ధరలు 4.3 శాతం వరకు పెరిగాయ్‌

దిల్లీ: తమ వాహన ధరలను 0.1-4.3 శాతం మేర పెంచినట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. కొత్త ధరలు ఈనెల 15 నుంచే అమల్లోకి వచ్చాయని తెలిపింది. ముడిపదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. దిల్లీలో చూస్తే ధరల పెరుగుదల సగటున 1.7 శాతం (ఎక్స్‌ షోరూం) ఉందని కంపెనీ వెల్లడించింది. ఆల్టో నుంచి ఎస్‌-క్రాస్‌ వరకు వివిధ మోడళ్లను రూ.3.15-12.56 లక్షల శ్రేణిలో సంస్థ విక్రయిస్తోంది. 2021లో వాహన ధరలను ఎంఎస్‌ఐ మూడుసార్లు పెంచింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని