
Published : 17 Jan 2022 01:51 IST
యునిలీవర్ బిడ్‌ను తిరస్కరించిన జీఎస్కే
లండన్: ఫైజర్‌తో కలిసి తాము నిర్వహిస్తున్న వినియోగదారు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల విభాగాన్ని కొనుగోలు చేసేందుకు యునిలీవర్ వేసిన 50 బిలియన్ పౌండ్ల (68.4 బి.డాలర్లు-సుమారు రూ.5,13,000 కోట్లు) బిడ్‌ను తిరస్కరించినట్లు ఔషధ దిగ్గజం గ్లాక్సోస్మిత్‌క్లైన్ (జీఎస్కే) వెల్లడించింది.గత డిసెంబరు 20న చివరగా వేసిన బిడ్‌ను కూడా తిరస్కరించినట్లు జీఎస్కే తమ వెబ్సైట్లో పేర్కొంది. తమ ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల యూనిట్ విలువను, భవిష్యత్ అంచనాలను తక్కువగా చూపుతూ బిడ్ దాఖలు చేసినందునే, తిరస్కరించినట్లు జీఎస్కే తెలిపింది.
Tags :