హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ.10,342 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.10,342.20 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే కాల లాభం రూ.8,758.29 కోట్లతో పోలిస్తే ఇది 18.1 శాతం అధికం.
దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.10,342.20 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే కాల లాభం రూ.8,758.29 కోట్లతో పోలిస్తే ఇది 18.1 శాతం అధికం. వడ్డీయేతర ఆదాయం పెరగడం, మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు కారణం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.37,522.92 కోట్ల నుంచి రూ.40,651.60 కోట్లకు చేరింది.
వడ్డీయేతర ఆదాయమే ఇందులో సుమారు 31 శాతం (రూ.8,183.60 కోట్లు) ఉంది. వార్షిక ప్రాతిపదికన ఇది 10 శాతం వృద్ధి చెందింది. నికర వడ్డీ ఆదాయం కూడా రూ.16,317.60 కోట్ల నుంచి 13 శాతం పెరిగి రూ.18,443.50 కోట్లకు చేరిందిది. రుణాలు 16.5 శాతం పెరిగి కొత్త గరిష్ఠాలకు చేరాయి. డిపాజిట్లు రూ.12,60,863 కోట్ల నుంచి 13.8 శాతం పెరిగి రూ.14,45,918 కోట్లకు చేరడంతో లిక్విడిటీ కవరేజీ నిష్పత్తి 123 శాతంగా నమోదైంది.
స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 0.81 శాతం నుంచి 1.26 శాతానికి పెరిగాయి. సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే 1.35 శాతం తగ్గాయి. నికర ఎన్పీఏలు 0.09 శాతం నుంచి 0.37 శాతానికి పెరిగాయి. త్రైమాసిక ప్రాతిపదికన 0.40 శాతం తగ్గాయి.
* మొండి బకాయిలకు కేటాయింపులు రూ.3,414.10 కోట్ల నుంచి రూ.2,994 కోట్లకు తగ్గాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం