అల్ట్రాటెక్ లాభం రూ.1710 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ ఏకీకృత ప్రాతిపదికన రూ.1710.14 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసిక కంపెనీ లాభం రూ.1,584.58 కోట్లతో పోలిస్తే ఇది 7.92 శాతం ఎక్కువ.
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ ఏకీకృత ప్రాతిపదికన రూ.1710.14 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసిక కంపెనీ లాభం రూ.1,584.58 కోట్లతో పోలిస్తే ఇది 7.92 శాతం ఎక్కువ. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.12,262 కోట్ల నుంచి 5.89 శాతం వృద్ధితో రూ.12,984.93 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు సైతం రూ.10,190.03 కోట్ల నుంచి 12.08 శాతం పెరిగి రూ.11,422.05 కోట్లకు చేరాయి. ‘2021 అక్టోబరులో వేగం పుంజుకున్నా, నవంబరులో గిరాకీ మళ్లీ నెమ్మదించింది. దిల్లీ పరిసరాల్లో నిర్మాణాలపై నిషేధం, కొన్ని రాష్ట్రాల్లో అధిక వర్షాలు, దీపావళి పండగల సీజన్ వంటివి ప్రభావం చూపాయి’ అని అల్ట్రాటెక్ వెల్లడించింది. డిసెంబరు త్రైమాసికంలో మొత్తం ఏకీకృత అమ్మకాలు 3 శాతం తగ్గి 23.13 మిలియన్ మెట్రిక్ టన్నులుగా నమోదు కాగా, కంపెనీ రూ.3,459 కోట్ల రుణాలను తిరిగి చెల్లించింది.
గిరాకీ పుంజుకుంటోంది: జనవరి-మార్చి త్రైమాసికంలో గిరాకీ పుంజుకుంటోందని కంపెనీ పేర్కొంది. ప్లాంట్ల ఆధునికీకరణ, వైట్ సిమెంట్ బ్రాండ్ బిర్లా వైట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం కోసం అల్ట్రాటెక్ రూ.965 కోట్ల మూలధన వ్యయాలను ప్రకటించింది. ప్రస్తుతం 6.5 లక్షల టన్నులుగా ఉన్న బిర్లా వైట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 12.53 లక్షల టన్నులకు పెంచేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. దశలవారీగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!