ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులపై సుప్రీం కోర్టుకు ట్విన్ స్టార్
రుణ ఊబిలో కూరుకుపోయిన వీడియోకాన్ గ్రూప్‌నకు చెందిన 13 కంపెనీలను కొనుగోలు చేసేందుకు తాము వేసిన రూ.2,692 కోట్ల బిడ్‌ను పక్కనపెట్టాలని జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్
దిల్లీ: రుణ ఊబిలో కూరుకుపోయిన వీడియోకాన్ గ్రూప్‌నకు చెందిన 13 కంపెనీలను కొనుగోలు చేసేందుకు తాము వేసిన రూ.2,692 కోట్ల బిడ్‌ను పక్కనపెట్టాలని జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) జారీ చేసిన ఉత్తర్వులపై వేదాంతా ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న ట్విన్ స్టార్ టెక్నాలజీస్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ నెల ప్రారంభంలో అసమ్మతి రుణదాతల అభ్యర్థనను ఎన్సీఎల్ఏటీ అనుమతిస్తూ, ట్విన్స్టార్కు అనుకూలంగా ముంబయి ఎన్సీఎల్టీ జారీ చేసిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. రూ.64,637.6 కోట్ల క్లెయిమ్‌లకు గాను 95 శాతం హెయిర్‌కట్‌తో ట్విన్ స్టార్ వేసిన రూ.2,692 కోట్ల బిడ్‌ను ముంబయి ఎన్సీఎల్టీ ఆమోదించిన సంగతి తెలిసిందే. కంపెనీ పరిష్కార నిపుణుడు దివాలా ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని, తాజాగా బిడ్లను ఆహ్వానించాలని ఎన్సీఎల్ఏటీ వెల్లడించింది. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు ట్విన్ స్టార్ టెక్నాలజీస్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ జైన్ ధ్రువీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం