అబాకస్‌.ఏఐలో 200 ఉద్యోగాలు

కృత్రిమ మేధ రంగంలోని అబాకస్‌.ఏఐ రానున్న మూడేళ్లలో రూ.370 కోట్ల (50 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ముంబయిలోని పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని విస్తరించేందుకు ఈ పెట్టుబడులను వినియోగించనున్నట్లు

Published : 19 Jan 2022 03:39 IST

రూ.370 కోట్ల కొత్త పెట్టుబడులు

దిల్లీ: కృత్రిమ మేధ రంగంలోని అబాకస్‌.ఏఐ రానున్న మూడేళ్లలో రూ.370 కోట్ల (50 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ముంబయిలోని పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని విస్తరించేందుకు ఈ పెట్టుబడులను వినియోగించనున్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం 20 మంది ఇంజినీర్లు, శాస్త్రవేత్తలను నియమించుకోవడంతో ప్రారంభించి, మూడేళ్లలో ఈ సంఖ్యను 200కు పెంచుతామని పేర్కొంది. చిన్న, పెద్దస్థాయి సంస్థలకు కృత్రిమ మేధ సేవలను అందించేందుకు ఆర్‌అండ్‌డీ కేంద్రం ఉపయోగపడుతుంది. బిందూ రెడ్డి, సిద్ధార్థ నాయుడు, అరవింద్‌ సౌందరరాజన్‌ ప్రారంభించిన ఈ సంస్థ ప్రధానంగా క్లౌడ్‌ ఏఐ, మెషిన్‌, డీప్‌ లెర్నింగ్‌లపై పనిచేస్తుంది. ఇప్పటికే ఈ సంస్థ 90 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను సమీకరించింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం కోసం మరిన్ని పెట్టుబడులను సమీకరించే ప్రయత్నాల్లో ఉంది. మారుతున్న వినియోగదారుల అభిరుచికి తోడు, గిరాకీని తట్టుకునేందుకు సంస్థలకు కృత్రిమ మేధ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, మెషీన్‌- డీప్‌ లెర్నింగ్‌ సేవలు అవసరమవుతున్నాయని సంస్థ సీఈఓ బిందు రెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని