రూ.37,000 కోట్ల స్మార్ట్‌ఫోన్ల తయారీ!

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో దాదాపు 5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.37,000 కోట్ల) విలువైన స్మార్ట్‌ఫోన్‌లను దేశీయంగా యాపిల్‌,

Published : 19 Jan 2022 03:42 IST

2021-22లో పీఎల్‌ఐ కింద ఉత్పత్తి చేయనున్న యాపిల్‌, శామ్‌సంగ్‌

దిల్లీ: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో దాదాపు 5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.37,000 కోట్ల) విలువైన స్మార్ట్‌ఫోన్‌లను దేశీయంగా యాపిల్‌, శామ్‌సంగ్‌ ఉత్పత్తి చేయనున్నాయని సమాచారం. కేంద్రప్రభుత్వం విధించిన లక్ష్యంలో ఈమొత్తం 50 శాతానికి పైగా ఎక్కువని ప్రభుత్వ వర్గాలు, పరిశ్రమ ప్రముఖులు చెబుతున్నారు. ఇక్కడ నుంచి మొబైల్‌ ఫోన్‌ ఎగుమతులే దాదాపు 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.15,000 కోట్ల) మేర ఉండొచ్చని అంచనా. అయిదేళ్ల కాలవ్యవధిలో పీఎల్‌ఐ పథకం కింద మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థలకు దాదాపు రూ.39,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. అంతర్జాతీయ తయారీదార్ల విభాగంలో పీఎల్‌ఐ పథకానికి అయిదు సంస్థలు ఎంపికయ్యాయి. వీటికి  3.2 బిలియన్‌ డాలర్ల స్థానిక ఉత్పత్తి లక్ష్యాన్ని విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని