
Published : 19 Jan 2022 03:43 IST
నేటి నుంచి టాటా మోటార్స్ ప్రయాణికుల వాహన ధరల పెంపు
దిల్లీ: ప్రయాణికుల వాహనాల ధరల్ని బుధవారం నుంచి సగటున 0.9 శాతం మేర పెంచబోతున్నట్లు టాటా మోటార్స్ మంగళవారం వెల్లడించింది. ముడి పదార్థాల ధరల వల్ల, ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో, అందులో కొంత భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నామని కంపెనీ తెలిపింది. టియాగో, పంచ్, హ్యారియర్ తదితర వాహనాలను దేశీయ విపణిలో సంస్థ విక్రయిస్తోంది. జనవరి 18 కంటే ముందు బుక్ చేసుకున్న వాహనాలపై ఈ ధరల పెంపు వర్తించదని స్పష్టం చేసింది.
Tags :