
ఫిక్స్‌డ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ను వెనక్కి నెట్టిన జియో
దిల్లీ: ఫిక్స్‌డ్-లైన్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించిన రెండేళ్లలోనే బీఎస్‌ఎన్‌ఎల్‌ను వెనక్కి నెట్టి రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ 2021 నవంబరు టెలికాం చందాదారుల నివేదిక ప్రకారం.. ఫిక్స్‌డ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో 43.4 లక్షల మంది ఖాతాదారులతో జియో అగ్రస్థానం దక్కించుకుంది. దాదాపు 20 ఏళ్ల కిందట ఈ విభాగం ప్రారంభమైనప్పటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ ఆధిపత్యం చెలాయించింది. గత అక్టోబరులో 41.6 లక్షలుగా ఉన్న జియో ఫిక్స్‌డ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య.. నవంబరులో 43.4 లక్షలకు చేరింది. ఇదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఖాతాదారుల సంఖ్య 47.2 లక్షల నుంచి 42 లక్షలకు తగ్గింది. భారతీ ఎయిర్‌టెల్ ఖాతాదారుల సంఖ్య 40.8 లక్షలుగా ఉంది.
* 2019 సెప్టెంబరులో ‘జియో ఫైబర్’ పేరిట ఫిక్స్‌డ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను జియో ప్రారంభించేటప్పటికి బీఎస్‌ఎన్‌ఎల్‌కు 86.9 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. 2021 నవంబరు కు బీఎస్‌ఎన్‌ఎల్ చందాదార్ల సంఖ్య సగానికి తగ్గింది.
* నవంబరులో దేశంలో మొత్తం బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 80.16 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో 43.29 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. భారతీ ఎయిర్‌టెల్ (21.01 కోట్లు), వొడాఫోన్ ఐడియా (12.24 కోట్లు), బీఎస్‌ఎన్‌ఎల్ (2.36 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.