
టియాగో, టిగోర్ సీఎన్‌జీ మోడళ్లు
దిల్లీ: టియాగో, టిగోర్ సీఎన్‌జీ వాహనాలను విడుదల చేయడం ద్వారా టాటా మోటార్స్ సీఎన్‌జీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ వాహనాల ధరల శ్రేణి రూ.6.09-8.41 లక్షలు (ఎక్స్-షోరూమ్, దిల్లీ). టియాగో ఐసీఎన్‌జీ శ్రేణి వాహనాలు 3 వేరియంట్లలో లభ్యమవుతున్నాయి. వీటి ధరల శ్రేణి రూ.6.09-7.64 లక్షలు. టిగోర్ ఐసీఎన్‌జీ శ్రేణి వాహనాలు రూ.7.69 లక్షలు, రూ.8.29 లక్షలు, రూ.8.41 లక్షల్లో అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. సీఎన్‌జీ విపణిలో బలోపేతం కావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రయాణికుల వాహనాల విభాగం మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర వెల్లడించారు. ‘కొన్నేళ్ల పాటు సీఎన్‌జీ వాహనాల వినియోగంలో వృద్ధి బాగుంటుంది. గిరాకీని దృష్టిలో ఉంచుకునే 2 మోడళ్లలో మూడేసి వేరియంట్లను విడుదల చేశామ’ని శైలేష్ తెలిపారు. టియాగో ఐసీఎన్‌జీ, టిగోర్ ఐసీఎన్‌జీ వాహనాలు 1.2 లీటర్ బీఎస్-6 ఇంజిన్‌తో రూపొందాయి. 73 పీఎస్ గరిష్ఠ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.